Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9320

దయగలదానవు తమకించకువే ఇట్టె

రాగము: పళవంజరం

దయగలదానవు తమకించకువే ఇట్టె
ప్రియపడఁగానే ఇంక బిగియఁగవచ్చునా॥పల్లవి॥
  
  
భావ మెఱిఁగి మెల్లనె పైకొని కూడుటగాక
కైవసమైనవానిఁ గక్కసింతురా
యేవల్లనుండి వచ్చిన యెదురుకొందురుగాక
నీవద్దఁ గూచుండఁగానే నిష్టూరమాడుదురా॥దయ॥
  
  
వూరట చేసుకొని వొడఁబరచుటగాక
కూరిమిగలుగు వారిఁ గోపగింతురా
కోరి మచ్చము లుండినా కూర్చుకొనవెలఁగాక
సారె సారెఁ జెనకఁగా సణఁగులాడుదురా॥దయ॥
  
  
వేడుకలెల్లాఁ జూపి విన్నవించుకొంటగాక
కూడి శ్రీవేంకటేశుఁ గొసరుదురా
మేడెపురతులలోన మెచ్చులు మెత్తురుగాక
పాడిగా నీతో నవ్వఁగా పంతములాడుదురా॥దయ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!