Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9342

దవ్వుల విరహమోప దగ్గరి గుట్టును నేర

రాగము: కాంభోది

దవ్వుల విరహమోప దగ్గరి గుట్టును నేర
పువ్వువంటిది నా మతి బుద్ధులిఁకఁ జెప్పరే॥పల్లవి॥
  
  
తమకించి పొదిగితే తరితీపు చాలదు
జమళి సిగ్గులైతే చవిలేదు
తెమలని వొరపైతే తేఁకువలు మెరయవు
భ్రమసి వుందాన నింకఁ బతితో నేమందునే॥దవ్వు॥
  
  
పక్కన నే నవ్వితేను పంతానకు వెలితయ్యా
లక్కవలెఁ గరఁగితే లావు చాలదు
వెక్కసానఁ బెనఁగితే వేసటలు గనమౌను
యెక్కడనున్నదో మేను యిట్లానుందాననే॥దవ్వు॥
  
  
తొలుత నేఁ జెనకితే దొమ్ములయ్యీఁ జేఁతలు
తలవంచుకుండితే దంటనందురు
కలసెను శ్రీవేంకట ఘనుఁడింతలో నన్ను
నెలకొంటి సంతసాన నేరుపులింకెట్టివే॥దవ్వు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!