Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9343

దవ్వుల వీఁగక దండకుఁ జేరరె

రాగము: సామంతం

దవ్వుల వీఁగక దండకుఁ జేరరె
వువ్విళ్ళూరుచు నొదుగరె మీరు॥పల్లవి॥
  
  
చెలువులు రాతిరి చేసిన చేఁతలు
చెలితో వేగిటు చెప్పె సతి
జల జల నంతలో జడివట్టెఁ జెమట
వెలఁదులు సురటి విసరరె మీరు॥దవ్వు॥
  
  
కాంతుఁడే కాంతముగాఁ జెప్పిన కత
సంతోసమునఁ జెప్పె సకితోను
పొంతనె దొంతర పులకలు వొడమెను
వింతలుగాఁ దెరవేయరె మీరు॥దవ్వు॥
  
  
శ్రీ వేంకటేశుఁడు చెందిన కలయిక
వావిరిఁ జెప్పం సవతితోను
చేవల నవ్వులు సెలవులఁ బొడమెను
భావించి మొక్కరె పలుమరు మీరు॥దవ్వు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!