Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9344

దవ్వుల సరసములు తగునా నీకు

రాగము: మంగళకౌశిక

దవ్వుల సరసములు తగునా నీకు
వువ్విళ్లె మేన నొచ్చమున్నవానివలెను॥పల్లవి॥
  
  
గోడ నిక్కి చూచేవు గొబ్బున దగ్గరి రావు
ఆడనుండె యెడమాట లాడించేవు
వీడెపు నీమోవి చూపి వికవిక నవ్వేవు
కూడి ముట్టువారి ముట్టుకొన్నవానివలెను॥దవ్వు॥
  
  
యెదుట సన్నలు సేసే వేకతము లాడేవు
పొదిగి నే రమ్మంటేఁ బొందు చూపేవు
బెదరేవు నీమేను పెనుగోర నంటితేను
చెదరి చీఁకటితప్పు సేయువాని వలెను॥దవ్వు॥
  
  
అలికేవు వులికేవు అంతలోన భ్రమసేవు
వెలయ నిలువుననె వెరగందేవు
యెలమి శ్రీ వెంకటేశ యీడకు విచ్చేసి నీవు
కలసితి విదె కలగన్నవానివలెను॥దవ్వు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!