Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9350

దానికేమి తప్పు గాదు దయ దలఁచు కొంటేను

రాగము: పాడి

దానికేమి తప్పు గాదు దయ దలఁచు కొంటేను
వీనుల మా మాటలెల్ల వినవమ్మ చెలియ॥పల్లవి॥
  
  
చలమెల్ల నొక్కటే సతులకుఁ బతులకు
బలిమి కొలఁదినే పంతాలు గాని
నిలుచున్నాఁడు నీపతి నేము వొడఁ బరచేము
నెలకొని ఇంతట మన్నించవమ్మ చెలియ॥దాని॥
  
  
బిగువెల్ల నొక్కటే పెనఁగేటివారికి
నగవు కొలఁదినే ననుపుగాని
మొగము చూచీ నతఁడు మొక్కేము నేమెల్ల
నిగిడి యీవేళను మన్నించవమ్మ చెలియ॥దాని॥
  
  
రతియల్లా నొక్కటే రసికుల కెల్లాను
మతులకొలఁదినే మరపు గాని
యితవై శ్రీ వేంకటేశుఁ డిదె కూడె మమ్ము మెచ్చ
సతమై నీ సరసాలు చల్లవమ్మ చెలియ॥దాని॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!