Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9351

దానికేమి దోసమా తగిన గేస్తురాలవు

రాగము: బౌళి

దానికేమి దోసమా తగిన గేస్తురాలవు
నేను నిన్ను నేమనేను నీకేలే సిగ్గులు॥పల్లవి॥
  
  
కొండవంటి దొర నిన్ను కొంగువట్టి తీసితేను
వొండేమీననలేక వొద్దికైతివే
అండనుండి సారెసారె నాతఁడే పిలువఁగాను
బండుబండు గాలేక పలికితివే॥దీని॥
  
  
చక్కని జాణఁడు నీ జవ్వనము దడవఁగ
గక్కన విడువలేక కైకొంటివే
వెక్కసానఁ గమ్మటిని వీడె మాతఁడియ్యఁగాను
అక్కరఁ దోయలేక అందుకొంటివే॥దీని॥
  
  
శ్రీవెంకటేశ్వరుఁడు చెక్కు నిన్ను నొక్కఁగాను
కైవశమై అంతలోనఁ గరఁగితివే
యీవేళ నన్నేలి వచ్చె నిద్దరి సవతులఁగా
కావించి నవ్వితి నిట్టే కదిసితివే॥దీని॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!