Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9356

దానికేమి యిప్పుడేమి తప్పిపోయీనా

రాగము: మధ్యమావతి

దానికేమి యిప్పుడేమి తప్పిపోయీనా
పూని యెదురుకట్లనె వున్నాఁడుగా॥పల్లవి॥
  
  
అలసిన రతివేళ ఆడినట్టి యీమాటలు
తలఁచుకొమ్మనమో తనుఁ దానె
పిలిపించి నాతోఁ దాను పెనఁగిన పెనఁగులు
తెలిపే లేవె యింకా తెరమరఁగుననె॥దాని॥
  
  
చిడుముడి మంచముపై చెనకిన చెనకులు
తడవి చూచుకొమ్మనవె తన మేననె
వుడివోక తారుమారై వునిచిన వుంగరాలు
తడఁబడీ వేళ్లను తానెరఁగఁడా॥దాని॥
  
  
కొత్తగా నాకాఁగిటిలో కూడినట్టి కూటములు
యెత్తి యిమ్మనవె యీవేళనె
హత్తెను శ్రీ వెంకటేశుఁ డట్టె తానన్ను
తత్తరపు దమకము తనివి నొందీనా॥దాని॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!