Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9366

దిక్కిందరికినైన దేవుఁడు కడుఁ

రాగము: ఆహిరి

దిక్కిందరికినైన దేవుఁడు కడుఁ
దెక్కలికాఁడైన దేవుఁడు॥పల్లవి॥
  
  
కొత్తపైండ్లికూఁతుఁ గోరి చూడఁబోయు
యెత్తి తేరిమీఁద నిడుకొని
నెత్తికన్ను మానినవాని పెండ్లికి
దెత్తిగొన్న యట్టి దేవుఁడు॥దిక్కి॥
  
  
గొప్పయునపెద్దకొండమీఁద నుండి
దెప్పరమ్ముగా దిగఁబడి
కప్పి రెండుదునుకలు గూడినవాని
తిప్పుఁదీరులాడే దేవుఁడు॥దిక్కి॥
  
  
బెరసి మేనమామబిడ్డకునై పోయు
నిరతఁపుబీరాలు నెరపుచు
యిరవైనమాయపుటెద్దులఁ బొరిగోన్న-
తిరువేంకటగిరి దేవుఁడు॥దిక్కి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!