Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9367

దిక్కు నీవే జీవులకు దేవసింహమా

రాగము: సాళంగనాట

దిక్కు నీవే జీవులకు దేవసింహమా
తెక్కుల గద్దియమీఁది దేవసింహమా॥పల్లవి॥
  
  
సురలెల్లాఁ గొలువఁగ సూర్యచంద్రులకన్నుల
తిరమైన మహిమల దేవసింహమా
నిరతిఁ బ్రహ్లాదుఁడు నీయెదుట నిలిచితే
తెరదీసితి మాయకు దేవసింహమా॥దిక్కు॥
  
  
భుజము లుప్పొంగఁగాను పూఁచిన శంఖుఁజక్రాల
త్రిజగముల నేలేటి దేవసింహమా
గజభజింపుచు వచ్చి కాచుక నుతించేటి-
ద్విజమునిసంఘముల దేవసింహమా॥దిక్కు॥
  
  
ముప్పిరిదాసులకెల్లా ముందు ముందే యొసగేటి-
తిప్పరాని వరముల దేవసింహమా
చిప్పల నహోబలాన శ్రీవేంకటాద్రిమీఁద
తెప్పల దేలేటియట్టి దేవసింహమా॥దిక్కు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!