Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9375

దిట్టనా నేనంత యేమి దేవరవన్నిటా నీవు

రాగము: కన్నడగౌళ

దిట్టనా నేనంత యేమి దేవరవన్నిటా నీవు
యెట్టైనా నెగ్గులెంచక యీడేర్చుమీ॥పల్లవి॥
  
  
నయగారి మాటలెల్ల నమ్మితిఁ గనక యిట్టే
భయము విడిచినీతోఁ బలికే నేను
దయగలవు గనక తడఁబడక యేపొద్దు
ప్రియములు చెప్పి నిన్నుఁ బిలిచే నేను॥దిట్ట॥
  
  
ముంచిన నీచేఁతలకు మోహించిన దాననై
పొంచి వూడిగేలు సేసి పొలసే నేను
కంచముపొత్తువాఁడవు గనక నీపాదాలకు
వంచనలేక యేల వడిమొక్కే నేను॥దిట్ట॥
  
  
కూడిన వాఁడవు గాన కొంకక శ్రీవేంకటేశ
వేడుక నీతో నవ్వి వెలసే నేను
యీడు లేక మన్నించితి వియ్యకొంటి నన్నిటికి
పాడితో నీయిచ్చకానఁ బరగితి నేను॥దిట్ట॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!