Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9407

దేవదుందుభులతోడ దివ్యులతోడ

రాగము: బౌళి

దేవదుందుభులతోడ దివ్యులతోడ
యీవేళ శ్రీహరి తేరు యేఁగీ వీధులను॥పల్లవి॥
  
  
గరుడధ్వజముతోడ కనకపు గుఱ్ఱాలతో
పరపై యష్టదిక్కుల బండికండ్లతో
నిరతితో పట్టుమాలి నిడుపపగ్గాలతోడ
యిరవై శ్రీపతి తేరు యేఁగీ వీధులను॥దేవ॥
  
  
పచ్చల ప్రతిమలతో పగడపు నొగలతో
హెచ్చిన వైడూర్యపు టిరుసులతో
కుచ్చుల ముత్యాలతో గుంపుఁ బైఁడికుండలతో
యిచ్చల భూధవు తేరు యేఁగీ వీధులను॥దేవ॥
  
  
మంచి నీలాల గద్దెతో మణిదర్పణాలతోడ
పొంచిన సింగారాలతో పూదండలతో
అంచె శ్రీవేంకటేశుతో నలమేలుమంగతోడ
యెంచఁగ దేవుని తేరు యేఁగీ వీధులను॥దేవ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!