Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9432

దేవర విన్నిటా నీ దేవిని నేను

రాగము: భైరవి

దేవర విన్నిటా నీ దేవిని నేను
నీవే నా కిన్నియును నేరుపుదుగాక॥పల్లవి॥
  
  
యెక్కుడుమాట నీవన్నా యెదురాడఁ దగవా
అక్కర మంకుదనాన నాడితిఁగాక
యిక్కువైనతగవు నీవెఱఁగనివాఁడవా
చొక్కముగా నామనసు సోదించేవుగాక॥దేవ॥
  
  
తప్పులు నీవు వట్టితే తారుకాణించఁదగవా
అప్పటికోపము లాఁపనైతిఁగాక
కప్పి నీవల్ల నేమైనా కడమలు గలవా
తిప్పి నాచేఁతల నన్నుఁ దిటిచేవుగాక॥దేవ॥
  
  
వొత్తి కాఁగిలించుకొంటే వొపననఁదగవా
చిత్తగించి రతి నలసితిఁగాక
కొత్తగా శ్రీ వేంకటేశ కూడితివి నన్ను నిట్టె
తత్తరపువాడవా దయ ఇదిగాక॥దేవ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!