Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9452

దేవుఁడవుగా ఆపె దేవులు నీకైనాఁ గాని

రాగము: గుజ్జరి

దేవుఁడవుగా ఆపె దేవులు నీకైనాఁ గాని
చేవదేరిన బుద్దులు చెప్పితి మోయయ్యా॥పల్లవి॥
  
  
కాంత గోపించి చూచితే కామునియమ్ములై తాఁకు
సంతసించి చూచితేనే చకోరాలౌను
శాంతుఁడవు నీవెట్టు సాము సేసే వీపెతోడ
పంతము లాడక కిందుపడి వుండవయ్యా॥దేవు॥
  
  
చెలి నిన్నుఁ దిట్టితేనే చిరు చెండులై తోఁచుఁ
నిల నిన్నుఁ బొగడితే నివె తేనెలౌ
చలపట్టి నీవెట్టు సరిదూఁగే వాపెతోడ
యెలమి యేప్రొద్దు నీవు ఇచ్చలాడవయ్యా॥దేవు॥
  
  
వనితకాఁగిలి నీకు వలపులవలలౌను
తనిసి చేపట్టితేనే తమ్మి పూజలౌ
యెనసి శ్రీవేంకటేశ యాపెతో నెట్టు మీ రేవు
మొనసి కూడితి విట్టె మొక్కు మొక్కవయ్యా॥దేవు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!