Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9458

దేవుఁడు దేవియు నదె తెరదియ్యరె

రాగము: పాడి

దేవుఁడు దేవియు నదె తెరదియ్యరె
పూవులదండలు దీసి పువ్వులియ్యవే॥పల్లవి॥
  
  
కన్నుల నిద్దురదేర గక్కన మేలుకొని
వున్నతి మొకాలు చూచే రొకరొకరు
పన్నీ రందియ్యరె పావడలు నందియ్యరె
గన్ననఁ గాళాంజి దగ్గరఁ బట్టరే॥దేవు॥
  
  
నగవులు నగుకొంటా నంటున లేచి కూచిండి
వొగిఁ గురులు దిద్దే రొకరొకరు
తగ నద్దాలు చూపరె తతితో బూగాలియ్యరె
వొగరుదేరఁ గస్తూరి వుండ లియ్యరే॥దేవు॥
  
  
బిగ్గెఁ గాఁగిలించుకొంటా ప్రియములె ఆడుకొంటా
వొగ్గిరి రతులకును వొకరొకరు
అగ్గమై శ్రీవెంకటేశుఁ డలమేలుమంగాఁ గూడి
వెగ్గళించే రలపార విసరరే యిపుడు॥దేవు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!