Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9473

దైవమ నీవే యిఁక దరి చేరుతువుఁ గాక

రాగము: దేవగాంధారి

దైవమ నీవే యిఁక దరి చేరుతువుఁ గాక
జీవుల వసము గాదు చిక్కిరి లోలోననే॥పల్లవి॥
  
  
పుట్టుట సహజ మిది పొదలే జీవుల కెల్ల
గట్టిగా జగమునందు కలకాలము
నట్టేటి వరదవలె నానాటి నీ మాయ
కొట్టుక పారఁగఁజొచ్చె కూడిన విజ్ఞానము॥దైవ॥
  
  
పాపమే సహజము బద్ధసంసారుల కెల్ల
కాఁపురపు విధులలో కలకాలము
తేపలేని సముద్రము తెరఁగున కర్మమెల్లా
మాపురేపు ముంచఁజొచ్చె మతిలోని ధైర్యము॥దైవ॥
  
  
లంపటమే సహజము లలి దేహధారులకు
గంపమోపుకోరికెల కలకాలము
యింపుల శ్రీవేంకటేశ ఇదె నీ దాసులని
పంపుసేసి బ్రదికించె ప్రపన్నసుగతి॥దైవ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!