Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9484

దైవమా నీవే మమ్ము దయదలఁచుట గాక

రాగము: ధన్నాసి

దైవమా నీవే మమ్ము దయదలఁచుట గాక
చేవల నీ సేఁతలెల్ల చెల్లును లోకానను॥పల్లవి॥
  
  
తీపు నంజేవేళ నట్టె తేటఁ బులుసింపౌను
పైపైఁ బుణ్యమయితేఁ బాపమింపౌను
వోపి జంతువుల కివి వొకటొకటికి లంకె
చేపట్టి పాపము లెట్టు సేయకుండవచ్చును॥దైవ॥
  
  
కడుఁ జలువై తేను గక్కన వేఁడింపౌను
చెడని విరతివేళ సిరులింపౌను
వొడలు మోచినవారి కొకటికటికి లంకె
తొడరు భోగాలు మాని తోయ నెట్టువచ్చును॥దైవ॥
  
  
యివియు నీమాయే యిన్నియు నీయాజ్ఞలే
జవళిఁ బ్రాణులకెల్ల సమ్మతైనవి
యివల శ్రీవేంకటేశ యిటు నీకే శరణంటి
తవిలి నీవే గతి దాఁగ నెట్టువచ్చును॥దైవ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!