Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9504

దొడ్డవానిఁ బంతము తొడిఁబడఁ గొనరాదు

రాగము: ముఖారి

దొడ్డవానిఁ బంతము తొడిఁబడఁ గొనరాదు
వెడ్డువెట్టుటే నేర్పు వేడుకతో నిన్నును॥పల్లవి॥
  
  
చక్కఁగా నీతో నేను చలము సాదించరాదు
ఇక్కడ నీతోఁ బొందు లెట్టు గూడీని
తొక్కేవు నాపాదము తొలఁగుమనఁగరాదు
మొక్కకు నే దీవించితి మొలనే నిన్నును॥దొడ్డ॥
  
  
వాసులకు నీతోను వాదులడువఁగరాదు
సేసవెట్టి నీపై నెట్టు చేయి చాఁచేము
ఆసపడేవు నాకు అవుఁగాదనఁరాదు
బాసలు సేయకు నమ్మి భావించితి నిన్నును॥దొడ్డ॥
  
  
మిగుల నీతో మందెమేళము సేయఁగరాదు
నగుతా నిన్నెట్లా నానలు వెట్టేది
అగపడి శ్రీవేంకటాధిపతి నన్నేలితివి
పొగడే వప్పటి నన్ను; పోదిసేసే నిన్నును॥దొడ్డ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!