Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9518

దొరతో సంగాతము దొరకినపాటే చాలు

రాగము: శంకరాభరణం

దొరతో సంగాతము దొరకినపాటే చాలు
వొరసి మీరఁగఁ బోతే నొక్క రీతి నుండునా॥పల్లవి॥
  
  
యేకతాన లోన నుండి యేల నన్నుఁ బిలిచేవు
వాకిటికి రావయ్య వలసితేను
చేకొని యొకతె యుంటె సిగ్గుపడి వెళ్లి వచ్చి
కూకులు వత్తులు గాను కూళదాననా॥దొరతో॥
  
  
మరిగించి మరఁగున మాట లే లాడించేవు
తెర దియ్యవయ్య అంత తీఁట గలితె
వరుసకు వచ్చినాపె వాదు నాతోఁ బెట్టుకొంటె
విరస మై యూరకుండ వెఱ్ఱిదాననా॥దొరతో॥
  
  
పట్టెమంచముపై నుండి పైఁ గాలు చాఁచ నేల
యిట్టె వుర మెక్కవయ్య యింత గలితె
జట్టిగా శ్రీవెంకటేశ సరి నొకతె గూచుంటె
వట్టి యితపు సేసుకో వాసి లేనిదాననా॥దొరతో॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!