Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9558

ధర్మముఁ బుణ్యము తనచేతిదే యిఁక

రాగము: దేవగాంధారి

ధర్మముఁ బుణ్యము తనచేతిదే యిఁక
మర్మములవి తనమనసే యెఱుఁగు॥పల్లవి॥
  
శిరసునఁ బెట్టిన సేసవలుండఁగా
పరిపరి విధముల బాసలునా
సరిగానేమని జరసే నే నింక
ధర మీఁదిపనులు తానే యెఱుఁగు॥ధర్మ॥
  
వొడఁబడి యిచ్చిన వుంగరమిదిగో
బెడిదముగా యిఁకఁ బిలుపులునా
బడిబడి నిటు చలపట్టనేల యిఁక
తడవేటిసుద్దులు తానే యెఱుఁగు॥ధర్మ॥
  
కలసిన కాఁగిటి కందువలున్నవి
పలుమారుఁ బెనఁగు బలములునా
చెలి ననుఁగూడెను శ్రీవేంకటేశుఁడు
తలపించవె యిటు తానేయెఱుఁగు॥ధర్మ॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!